బచ్చన్నపేట జూన్ 23 : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి డాక్టర్ కల్నల్ నరేందర్ రెడ్డి చేయూతనివ్వడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. సోమవారం మండలంలో 2025 విద్యాసంవత్సరం లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు హర్షవర్ధన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పడమటికేశవాపూర్, సుప్రియ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కొన్నే లకు పదివేల రూపాయలు నగదు అందించారు. అదే విధంగా ఆయా పాఠశాలలకు పదివేల రూపాయల చొప్పున మొత్తం 40,000 రూపాయల ఆర్థిక సహాయంగా ఆదిరెడ్డి అకాడమీ చైర్మన్ డాక్టర్. సి. కల్నల్ నరేందర్ రెడ్డి సహకారంతో అందించారు.
ఈ సందర్భంగా భోజన్న మాట్లాడుతూ ప్రైవేట్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అందులో భాగంగా నరేందర్ రెడ్డి ఒక సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాల బలోపేతంకు సహకారం అందించడం గొప్ప విషయం అన్నారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఇందుకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాకాధికారి వెంకటరెడ్డి, ట్రస్ట్ ఇంచార్జి గొట్టె కనకయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విజయ, బాలకిషన్ రావు, సుధాకర్, ఇంద్రసేనారెడ్డి, మధుకర్ రెడ్డి, సబ్జెక్టు నిపుణులు విష్ణు, లక్ష్మీ పావని, యాదగిరి పాల్గొన్నారు.