వరంగల్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరి, కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నాయి. మరోవైపు కూతురు సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తల్లి కొండా సురేఖ మంత్రి పదవికి గండంగా మా రిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ సహా ఐదురుగు ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ ప్రాంగ ణంలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో మీడియాలో స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ బస్వ రాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి సహా మొత్తం 20 మంది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి తొలగించాలని (బర్తరఫ్) డిమాండ్ చేయడంతో రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలకు మరోసారి వరంగల్ వేదికైంది. అయితే, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి రేవంత్ కేబినేట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల్లో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని వస్తున్న డిమాండ్ విషయంలో కానీ, ఆమె కూతురు సుస్మితా పటేల్ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మరో మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రామచంద్రూనాయక్, యశస్వి నీరెడ్డితోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వంటి వారు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. శరవేగపు ఈ తుఫాన్ సదృశ్య పరిణామాలకుతోడు సీఎం రేవంత్‌రెడ్డి తన అమెరికా పర్య టనను రద్దు చేసుకొని హుటాహుటిన తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఏదో జరగబోతున్నది? అన్న వాతావరణం నెలకొన్నది.
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు, ఆ అనంతర కొనసా గింపు పరిణామాలతో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్న సంఘటనలకు వరంగల్ మరోసారి వేదిక కావడం గమనార్హం. అయితే, దీని వెనుక ఆంతర్యం వాటాల పంచాయితీ కారణమని ఒకవర్గం అభిప్రాయపడు తుండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఆయన వర్గం అంతా కలిసి వారిని పొమ్మనలేక పొగపెడుతున్నారని మరోవర్గం పేర్కొంటున్నది. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా సీఎం మేడారం టూర్‌ను ఖరారు చేసుకోవడం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తన శాఖలో, తన జిల్లాలో తనను ఒంటరి చేయాలని కుట్ర పన్నారని ఆమె తన సన్నిహి తులతో పేర్కొన్నారని సమాచారం.
ఈ పరిణామల నేపథ్యంలోనే మంత్రి సురేఖ కూతురు సుస్మి త సీఎంను టార్గెట్ చేశారని అంటున్నారు. అయితే, ఇదే అదనుగా మంత్రిపదవి నుంచి సురే ఖను తప్పిస్తే తమకు అవకాశం కలుగుతుందని ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు బలంగా భావించారని, ఈ తరుణంలో సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఆయుధంగా దొరికాయని అంటున్నారు. అయి తే, అందరూ ఊహాగానాలకు అనుగుణంగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా? చేస్తే పరిణామాలు ఏమిటీ? గతానుభవాలను పరిగణనలోకి తీసుకుంటే అసలు ఆమెను బర్తరఫ్ నుంచి తొలగించరనేది కొందరి వాదన అయితే, సమస్యేలేదు ఈసారి వేటు పడడం ఖాయం అని, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేసే ధోరణినే అను సరిస్తుందని మరికొందరి వాదన. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు రేవంత్‌రెడ్డి సర్కార్ ‘కొండ’ను అంటుకున్నదా? ‘కొండ’కు రేవంత్ ప్రభుత్వం అంటుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.