కోల్డ్ స్టోరేజ్ ఎదుట మిర్చి రైతుల ధర్నా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డు స్టోరేజ్ల్లో మిర్చి భద్రపరిచేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు రైతులు మిర్చి బస్తాలు అమ్మేందుకు తీసుకొచ్చారు. ఖరీదుదారులు నిర్ణయించిన ధర మిర్చి రైతులకు నచ్చలేదు.
- రైతుల మిర్చిని కోల్డ్లో భద్రపరచాలని డిమాండ్
- పోలీసులు, మార్కెట్ అధికారులు రంగ ప్రవేశం
- రైతుల మిర్చిని నిలువచేసేందుకు అనుమతి
కాశీబుగ్గ, మార్చి 22: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డు స్టోరేజ్ల్లో మిర్చి భద్రపరిచేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు రైతులు మిర్చి బస్తాలు అమ్మేందుకు తీసుకొచ్చారు. ఖరీదుదారులు నిర్ణయించిన ధర మిర్చి రైతులకు నచ్చలేదు. వెంటనే పలువురు రైతులు తమ సరుకును కోల్డ్స్టోరేజ్ల్లో నిల్వ చేసుకుందామని చాంముండేశ్వరి కోల్డ్స్టోరేజ్కు వెళ్లగా.. వారు స్థలం లేదని ఇతరుల సరుకును దించుకున్నారు. దీంతో రైతులు సంబంధిత సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో అక్కడే రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కావాలనే రైతుల సరుకులు నిల్వ చేసుకొనివ్వడం లేదని, ఖరీదు వ్యాపారుల సరుకును మాత్రమే నిల్వ చేసుకుంటున్నారని ఆరోపించారు.
రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఎనుమాముల పోలీసు లు, మార్కెట్ కమిటీ అధికారులు చేరుకున్నారు. రైతుల సమస్యలు తెలుసుకొని సంబంధిత కోల్డ్ స్టోరేజ్ యజమానితో మాట్లాడి రైతులు మిర్చి బస్తాలు కోల్డులో వెసుకునేలా చేశారు. దీంతో రైతు లు ఆందోళన సద్దుమనిగింది. కాగా, రైతులు ఆందోళనతో జిల్లా మార్కెటింగ్ అధికారి పాలకుర్తి ప్రసాద్రావుతోపాటు గ్రేడ్-2 కార్యదర్శి రాము, గంగాధర్ కోల్డ్స్టోరేజ్లను తనిఖీ చేశారు. నిల్వ వివరాలను తెలుసుకున్నారు. కోల్డులు ఖాళీగా ఉంటే రైతులకు తప్పకుండా అవకాశం కల్పించాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

