MGM Hospital | వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలను తరలించే అంబులెన్స్ వాహనాలు లేక, మృతదేహాన్ని ఆటోలో తరలించారు. పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన మహిళ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని చౌటుపల్లి గ్రామానికి తరలించాల్సి ఉంది. అయితే అంబులెన్సులు లేకపోవడంతో చేసేదేమి లేక మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆటోలో తరలించారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఎంజీఎంలో సౌకర్యాల పరిస్థితిని అద్దం పట్టేలా ఉన్న ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Talasani Srinivas Yadav | నగరంలో ఒక్క ఇంటినైనా నిర్మించారా ? అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసిన తలసాని
Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత అవాస్తవం : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Oka Roju | జపాన్ మంచులో సాయిపల్లవి ప్రేమకథ.. తెలుగులో ‘ఒక రోజు’గా ఏక్ దిన్!