మహదేవపూర్ (కాళేశ్వరం)/కృష్ణకాలనీ, మే 25: కాళేశ్వరంలో సరస్వతీ నది పుషరాలకు జనం వెల్లువలా వస్తున్నది. 11వ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ పెరిగింది. భక్తులు పోటెత్తడంతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాలకు చెందిన వారు లక్షలాదిగా తరలివచ్చి నదీ స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పితృ దేవతలకు పిండ ప్రదానం చేశారు.
అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని మొకులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తులు కిక్కిరిసిపోగా, స్వామివారి దర్శనానికి గంటల సమయం పట్టింది. పుషరాలకు ఒకరోజే సమయం ఉండగా, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. భారీగా వచ్చిన వాహనాలతో పారింగ్ ప్రదేశాలు, ప్రధాన రహదారులన్నీ నిండిపోయాయి. సిరొంచ ప్రధాన రోడ్డుపై ఎదురెదురుగా వస్తున్న కార్లు ఢీకొనగా పలువురికి గాయాలయ్యా యి. వారిని ఆస్పత్రికి తరలించారు.
నేడు కాళేశ్వరానికి ఎమ్మెల్సీ కవిత రాక..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కాళేశ్వర క్షేత్రానికి రానున్నారు. పుషర ఘాట్‌లో నదీ స్నానం చేసి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
బస్సుల కోసం ఎదురుచూపులు
తిరుగు ప్రయాణంలో బస్సులు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై గంటలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
భక్తిశ్రద్ధల మధ్య సరస్వతీ మాల హారతి
ఘాట్ వద్ద సరస్వతీ నవరత్న మాల హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య కాశీ పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సాహంగా వీక్షించారు.
ధరలు భగ్గుమంటున్నాయి
పుషరాల్లో ధరలు భగ్గుమంటున్నాయి. వాటర్ బా టిల్‌ను రూ.50కు విక్రయిస్తున్నారు. టీ, టిఫిన్‌కు కూడా డబుల్ రేట్ చెప్పుతున్నరు. రూ. 300 వచ్చే బ్యాగును రూ.1000కి అమ్ముతున్నారు. పిల్లలకు ఆట వస్తువులు ఏమీ కొనలేకపోతున్నం. అధిక ధరల దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి కట్టడి చేయాలి.
– చంద్రశేఖర్, బసంత్ నగర్, పెద్దపల్లి జిల్లా
పుణ్యస్నానాలు ఆచరించిన గవర్నర్ దంపతులు
త్రివేణి సంగమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పుణ్యసాన్నాలు ఆచరించారు. నదీమ తల్లికి పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయనకు అర్చకులు, అధికారులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు శాలువాతో సన్మానించి ఆశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు, స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.