మీ సాహసానికి సెల్యూట్
అడవిలో గుట్టపై ఉన్న ప్రజలకు వైద్యం అందించేందుకు ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య సాహసమే చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ములుగు జిల్లా వాజేడు అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టపై నివసించే గిరిజనులకు వైద్య పరీక్షలు చేసేందుకు వాగులు, గుట్టలు, వరదను సైతం లెక్కచేయలేదు.
- వైద్యం కోసం 32కి.మీ. పెనుగోలుకు డీఎంహెచ్‌వో అప్పయ్య
- గుట్టలు, వాగులు దాటి తిరుగుపయనం
- అభినందనలు తెలిపిన అధికారులు, స్థానికులు
వాజేడు, జూలై 17 : అడవిలో గుట్టపై ఉన్న ప్రజలకు వైద్యం అందించేందుకు ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య సాహసమే చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ములుగు జిల్లా వాజేడు అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టపై నివసించే గిరిజనులకు వైద్య పరీక్షలు చేసేందుకు వాగులు, గుట్టలు, వరదను సైతం లెక్కచేయలేదు. వాజేడు మండలకేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే మూడు గుట్టలెక్కి.. మూడు వాగులు దాటాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో మంగళవారం డీఎంహెచ్‌వో అప్పయ్య తన సిబ్బందితో కలిసి మంగళవారం పెనుగోలు గుట్టపైకి చేరుకొని అక్కడున్న 10 కుటుంబాలకు చెందిన 39 మందికి దోమతెరలను అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని అవసరమై న వైద్య సేవలందించారు. తిరుగు ప్రయాణంలో జోరువాన మొదలైనా వెరవకుండా బుధవారం సాయంత్రానికి వాజేడు చేరుకున్నారు. ఓ జి ల్లాస్థాయి అధికారి వైద్యం కోసం పెనుగోలు గ్రామానికి 32 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అప్పయ్యను ధైర్యసాహసాలకు సెల్యూట్ అంటూ అధికారులతో పాటు స్థానికులు అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

