వర్ధన్నపేట, నవంబర్ 11 : నకిలీ వరి విత్తనాలతో రైతులు నట్టేట మునిగారు. వేలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేస్తే వడ్లకు బదులు తాలు రావడంతో తీవ్రంగా నష్టపోయారు. వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండాకు చెందిన పలువురు గిరిజన రైతులు స్థానిక ఓ ఎరు వుల దుకాణంలో వానకాలం వరి సాగు కోసం అన్నపూర్ణ అనే విత్తన కంపెనీకి చెందిన సీడ్‌ను కొనుగోలు చేశారు. సుమారు 12 ఎకరాల్లో సాగు చేసిన రైతులకు వరి కంకి వేసే దశలో వడ్లకు బదు లు తాలు వచ్చింది. దీనిని నివారించేందుకు ఎరువులు, పురుగు మందులు వేసొనా కంకులకు 60 శాతానికి పైగా తాలు గింజలు ఉండడంతో రైతు లు తీవ్రంగా నష్టపోయారు.
దీంతో ఎరువులు విక్రయించిన వ్యాపారి వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే కంపెనీ ప్రతినిధులకు తెలుపుతామని చెప్పారు. రైతులు వరి పైరుతో మామునూరు శాస్త్రవేత్తలను కలిసి సమస్యను వివరించగా హైబ్రీడ్ విత్తనాలు ఇవ్వడంతో తాలు వస్తున్నదని వెల్లడించారు. విత్తనాలు ఇచ్చిన వ్యాపారిని కలువగా ‘మేము ఏమీ చేయలేం.. కంపెనీ ప్రతినిధులు స్థానికంగా లేరు.. వారు వచ్చిన తర్వాత మాట్లాడతాం..’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధిత రైతు బానోత్ రవినాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. నకి లీ విత్తనాలతో ఎకరాకు రూ.30 వేల వరకు నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. పంట నష్టపరిహారం అందించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.