CPI | హనుమకొండ : పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు అన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక రెడ్ బుక్ డే విడుదల సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని భాషలలో అచ్చు అయి నేటికీ ఎక్కువ సంఖ్యలో కమ్యూనిస్టు ప్రణాళికను అధ్యయనం చేస్తున్నారని, దాని మార్గంలో కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోమతోన్మాదులు మూఢ నమ్మకాలు పెంచి పోషిస్తున్నారని, వారికి సైన్స్ మీద నమ్మకం ఉండదని, ప్రపంచ మానవాళి మనగడ కోసం కమ్యూనిస్టులు బూర్జువా వర్గంపై నిరంతరం పోరాడుతున్నారని, సైన్స్‌ను, భౌతికవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
నేటి కార్పొరేట్ యుగంలో మూఢనమ్మకాల విస్తృత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారని, వేగంగా మానవుడు కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్న నేటి సందర్భంలో దేశంలో జాతీయ వాదం పేరుతో వారు అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నారని అన్నారు. పెట్టుబడుదారి వ్యవస్థ బలపడే కొద్ది సమాజంలో అంతరాలు పెరుగుతాయని, పెట్టుబడిదారి వ్యవస్థలో నిరుద్యోగం పెనుభూతంలా కొనసాగుతుందన్నారు.
కమ్యూనిస్టు ప్రణాళిక ఏర్పడి 177 సంవత్సరాలు కొనసాగుతున్నా ప్రపంచంలో అన్ని భాషల్లో ఎక్కువగా ప్రచురితం అయ్యి ప్రజలు చదువుతున్నారని, కారల్ మార్క్స్, ఎంగేల్స్.. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎలా దోపిడీ గురవుతున్నారో కార్మికులు తమ హక్కుల సాధన కోసం పెట్టుబడుదారి వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం అంతరాలేని సమాజం కోసం బానిస సమాజానికి వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా.. వెట్టి చాకిరి ఎనిమిది గంటల పని విధానం కోసం ఎలా ఉద్యమించాలో తెలిపారన్నారు. ప్రపంచ గతిని మార్చిన కమ్యూనిస్టు ప్రణాళిక ను కార్యకర్తలు నాయకులు ఎక్కువ సంఖ్యలో నిరంతరం అధ్యయనం చేయాలని, దేశ పరిస్థితులను ఆ ప్రాంతంలో పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మార్క్స్ ఎంగేల్స్.. రచనలను. చదవాలని నిరంతరం అధ్యయనం సమాజాన్ని మార్పు కోసం సమాజ స్థాపన కోసం ముందుకు సాగాలని ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు కోరారు. అనంతరం కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాలను మరి పార్టీసాహిత్యాన్ని కార్యకర్తలకు నాయకులకు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆదరి శ్రీనివాస్,అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లెరు వీరస్వామి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మునగాల బిక్షపతి, నాయకులు బత్తిని సదానందం, వేల్పుల సారంగ పాణి, కొట్టెపాక రవి, కండె నరసయ్య, దామెర సుదర్శన్, ఏదునూరి వెంకటరాజం, అనురాధ తదితరులు పాల్గొన్నారు.