నర్సంపేట/ఖిలావరంగల్/కాశీబుగ్గ, జూన్ 20: నీట్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేశ్ డిమాండ్ చేశారు. నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌పై బీజేపీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని ఎద్దేవా చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఒక్కో విద్యార్థి వద్ద రూ. 30 లక్షలు వసూలు చేసి బీహార్ రాష్ట్రంలో ప్లాన్ ప్రకారం 4వ తేదీన పేపర్ లీక్ చేయడం వల్ల 67 మంది విద్యార్థులకు టాప్ స్కోర్ వచ్చిందని ఆరోపించారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరికాదన్నారు. కార్యక్రమంలో యాక య్య, సతీశ్, నాగరాజు, అశోక్, సందీప్, సాంబరాజు, యాదగిరి, అజయ్, ఈశ్వర్, రాజు, సారయ్య పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిరసన తెలిపారు.
ప్లకార్డులు చేతబూని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా కార్యవర్గ సభ్యుడు గన్నారపు రమేశ్, ల్యాదల్ల శరత్, సంగీ ఎలేందర్, యాకోబు, రాజేందర్, వెంకటాద్రి, పాషా, సారయ్య పొల్గొన్నారు. నీట్ పరీక్ష లీక్‌కు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మండల కార్యదర్శి రవీందర్ ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ సెంటర్లో ధర్నా చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సండ్ర కుమార్, ఎండీ కాశీం, పరికరాల రమేశ్, ఐలయ్య, కొయ్యడ మనోహర్, బుల్లె సామిల్, ఎండీ సాదిక్, శ్రీలక్ష్మి, అనూష, వసంత, భాగ్యశ్రీ, సరస్వతి పాల్గొన్నారు.