సుబేదారి, మే 29 : ‘ప్రతి రౌడీ షీటర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేయాల్సిందే.. ఎవరినీ వదిలిపెట్టొద్దు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్టేషన్ పోలీసు అధికారిపై చర్యలు తప్పవు’ అని పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘స్టేషన్‌కు పిలువరు – కౌన్సిలింగ్ చేయరు, రౌడీ లీడర్లపై ఖాకీల కన్నేది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శుక్రవారం హనుమకొండ భీమారం ఎర్రగట్టు కిట్స్ కళాశాలలో పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిక్షణలో భా గంగా ప్రతి స్టేషన్ అధికారి నెలలో ఒకసారి రౌడీషీటర్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి, అతడి స్థితిగతులు తెలుసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో బెల్ట్‌షాప్ లు మూయించాల్సిన బాధ్యత స్టేషన్ అధికారులదేనని, రోడ్లపై పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేర నియంత్రణ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, హాస్టల్ నిర్వాహకుల వివరాలు సేకరించాలని సీపీ సూచించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకే స్టేషన్ అధికారి ప్రజలకు అందుబాటులో ఉం డాలన్నారు. సమీక్షలో డీసీపీలు అంకిత్‌కుమార్, దార కవిత, రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.