ఖిలావరంగల్: డివిజన్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు అన్నారు. మంగళవారం డివిజన్లోని ఆదర్శ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధి ఆదర్శ నగర్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. డ్రైనేజీ ద్వారా మురికి నీరు వెళ్లే విధంగా జేసీబీ సహాయంతో మరమ్మతులు చేపించామని పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు నీరు వెళ్లే విధంగా డ్రైనేజీలు పరిశుభ్రపరచాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. వాటర్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాలనీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గోపగాని శంకర్, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల రాజు, ప్రధాన కార్యదర్శి షేక్ మాషుక్, యూత్ నాయకులు సుంకు శ్రీకాంత్, రబ్బానీ, బోడ ధర్మ, జవాన్ రాజేష్, తదితరులు ఉన్నారు.