కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను భారీ మోజార్టీతో ఎగురవేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. పడమరకోట అమరవీరుల స్తూపం వద్ద కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ ఏర్పాటు చేసిన చేరికల సభకు ఆయన హాజరయ్యారు.
- రౌడీలు గుండాలు వస్తున్నారు.. ప్రజలు ఆలోచించి ఓటు వేయండి
- నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశా : ఎమ్మెల్యే నన్నపునేని
- ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాకయ్య బీఆర్ఎస్లో చేరిక
- గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే
ఖిలావరంగల్, నవంబర్ 1: బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను భారీ మోజార్టీతో ఎగురవేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. పడమరకోట అమరవీరుల స్తూపం వద్ద కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ ఏర్పాటు చేసిన చేరికల సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు, కార్యకర్తలు మెట్టుదర్వాజ వద్దకు ఎదురేగి డప్పుచప్పుళ్ల మధ్య పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొడ్రాయి వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నన్నపునేని మాట్లాడుతూ రౌడీలు, గుండాలు వస్తున్నారు.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాను తూర్పును అద్భుతంగా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. ప్రశాంతంగా ఉన్న ఓరుగల్లులో రౌడీయిజం, గూండాయిజం ఉండొద్దని, అలాంటి వారిని ప్రజలు తిరస్కరించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఇక్కడ ఒకలాగా, పరకాలకు వెళ్లినప్పుడు మరోలా మాట్లాడారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చారని ప్రశ్నించారు. అనంతరం ఖిలావరంగల్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజబోయిన యాకయ్య కార్పొరేటర్ బైరబోయిన ఉమ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నన్నపునేని ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు సుదీర్ఘ సేవలందించిన ఆయన ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్ వల్లే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే, స్వతంత్య్ర అభ్యర్థిగా కార్పొరేటర్‌కు పోటీ చేసిన శ్రవంతి, మరో యూనియన్ నాయకుడు యాకోబుతోపాటు 150 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు తోటకూరి నర్సయ్య, బండి బాబురావు, గుమస్తాల సంఘం అధ్యక్షుడు ఇనుముల మల్లేశం, ప్రధాన కార్యదర్శి సులగం వేణుగోపాల్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కట్టమల్లు, గజ్జల రామకృష్ణ, మీరిపెల్లి రాజు, బొల్లం కార్తీక్, రావుల రాజేశ్, నలిగంటి ప్రేమ్‌సాగర్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం
కరీమాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఫోర్టురోడ్డులోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సింగరి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, యువకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. యువతకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తాను కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని నన్నపునేని కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

