ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
ఎన్నికలకు ముం దు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు.
- ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి రూరల్, జనవరి 13 : ఎన్నికలకు ముం దు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ము ఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా నేటికీ రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందలేదని, రూ.2 లక్షల పంట రుణాల మాఫీ నెరవేరలేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమలు కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వంద రోజులు ఓపిక పడుతామన్నారు. అప్పటివరకు హామీలు అమలు చే యకుంటే ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్ప లా కాపాడుకుంటానన్నారు. పార్టీని సంస్థాగతంగా పటి ష్టం చేస్తామని, ఎంత పెద్ద వారైనా సరే పార్టీ నియామవళికి విరుద్ధంగా ప్రవరిస్తే సహించేది లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ దార శారదాశంకరయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, బొమ్మగాని కొమురయ్య, మాజీ మార్కెట్ క మిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్‌రెడ్డి, శివరాత్రి సుధాకర్, కారుపోతుల వేణు, పాము శ్రీనివాస్, కమ్మగా ని నాగన్న, గర్వందుల మల్లేశ్, సంపత్ శ్రీపాల్‌రెడ్డి, పోశాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

