నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 9: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్లు సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు వారిని అదుపులో కి తీసుకున్నారు. ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ గ్రా మాల అభివృద్ధికి తాము అప్పులు చేసి పనులు చేశామని, తమ కు రావాల్సిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుం డా మానసిక క్షోభకు గురిచేస్తున్నదని అన్నారు.
బిల్లులు చెల్లించాలని నిరసన తెలిపేందుకు బయలుదేరిన తమను నిర్బంధించడం దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో పోలీసు పాలన నడిపిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నద ని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.