హనుమకొండ, జూలై 18: కొట్లాడి సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వంద శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎ స్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. కేంద్ర రైల్వేశాఖ మంత్రివర్యులు శ్రీ అశ్వి నీ వైష్ణవ్ హనుమకొండ జిల్లా కాజీపేటలో పర్యటించునున్న నేపథ్యంలో పలు డిమాండ్లతో కూడి న ప్రకటనను శుక్రవారం విడుదల చేశారు.
రాష్ట్ర పునర్విభజన హకుల సాధన కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీయేనని పేరొన్నారు. ఉద్యమా లు, పోరాటాల ఫలితమే కాజీపేట కోచ్ ప్యాక్టరీ ఏర్పాటన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పా టు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కళ, హకు అని, దాని సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ దాకా.. కేంద్రంలోని నాటి కాంగ్రెస్ నుంచి నేటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి.. 40 ఏళ్ల పాటు కోచ్ ఫ్యాక్టరీ కో సం నిరంతరాయంగా కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ విషయంలో 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్లు బీజేపీ పార్టీలు తెలంగాణకు కోచ్‌ఫ్యాక్టరీ కేటాయించకుండా అన్యాయం చేశాయని గుర్తు చేశారు. ఓరుగల్లు ప్రజలు ఎన్నో పోరాటాలు, ఐక్య ఉద్యమ కార్యాచరణలు చేపట్టారని, నాడు వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌ను ఒప్పుకోని ధికార స్వరం మన ప్ర జలదని స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధులు భూమిని ఇచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభు త్వం, ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. పదేండ్ల పాలనలో కోచ్ ఫ్యాక్టరీ కోసం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఓరుగల్లు గులాబీ శ్రేణులు, వామపక్ష నేతలు ఎంతో పోరాడారని పేరొన్నారు.