మహదేవపూర్/కాళేశ్వరం, డిసెంబర్ 28: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ), అన్నారం (సరస్వతీ బరాజ్)ను నేడు రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించనుంది. మొదట రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ, ఇండ్రస్ట్రీస్, శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మేడిగడ్డకు రానున్నారు. బరాజ్‌లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి బరాజ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు అన్నారం బరాజ్‌కు మంత్రులు చేరుకోనున్నారు. బరాజ్‌లో వస్తున్న నీటి బు డుగలను పరిశీలిస్తారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు,ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు చేపట్టిన ఏర్పాట్లపై గురువారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. హెలీ ప్యాడ్, సభా ప్రాంగణం, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.