రాయపర్తి, డిసెంబర్ 1: విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాలుగు రోజులుగా విద్యార్థులకు ఉచితంగా నిర్వహిస్తున్న ఈసీజీ తరగతులను గురువారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావుతో కలిసి ఆమె పరిశీలించారు.
మండలకేంద్రంలోని కేజీబీవీ, జడ్పీహెచ్ఎస్, కొండూరులోని ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తరగతులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కేజీబీవీ విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన దుప్పట్లు, జంపకానాలను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు గజవెల్లి అనంతప్రసాద్, కర్ర సరితా రవీందర్రెడ్డి, కౌన్సిలర్ శివప్రసాద్, గురుకుల స్పెషల్ ఆఫీసర్ బుర్ర కవిత, ఉపాధ్యాయులు మణిమాల, లక్ష్మి, సిబ్బంది శ్రీనివాస్ పాల్గొన్నారు.