HomeWarangal-ruralCm Kcr Serious Warning To Mla Shankar Naik In Mahabubabad Collector Issue
అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లోకి..
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని, పార్టీని నమ్మి వచ్చిన కార్యకర్తలు, ప్ర జాప్రతినిధులను గుండెలో పెట్టుకొని చూసుకుంటానని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు.
కార్యకర్తలను గుండెలోపెట్టుకొని చూసుకుంటా..
ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
ఇద్దరు సర్పంచ్‌లు, ఎంపీటీసీతోపాటు 350 మంది టీఆర్ఎస్లో చేరిక
నెల్లికుదురు, నవంబర్ 24 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని, పార్టీని నమ్మి వచ్చిన కార్యకర్తలు, ప్ర జాప్రతినిధులను గుండెలో పెట్టుకొని చూసుకుంటానని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పార్టీ కార్యాలయంలో కాచికల్ సర్పంచ్ గుగులోత్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ గట్టు శ్రీనివాస్, ఎంపీటీసీ పెరుమాండ్ల సుమలతామురళి, దుర్గాభవాని తండా సర్పంచ్ గుగులోత్ కైలాభిక్షా, మాజీ ఉపసర్పంచ్ గంజి విజయపాల్ రెడ్డి, వార్డు సభ్యులు జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 350 మంది కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. శంకర్‌నాయక్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని, పార్టీలో చేరిన ప్రతిఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా సమన్యాయం చేసే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్, నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నామని, మీరందరూ మాకు బాసటగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవీనవీన్రావు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుపాటి వెంకట్ రెడ్డి, దర్శనం భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, పీఏసీఎస్ చైర్మన్లు కాసం లక్ష్మీచంద్రశేఖర్ రెడ్డి, గుండా వెంకన్న, నెల్లికుదురు సర్పంచ్ బీరవెళ్లి యాదగిరి రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పులి రామచంద్రు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్, మండల కో-ఆప్షన్ సభ్యుడు రహెమాన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భీముడు, శ్రీరామగిరి సొసైటీ వైస్ చైర్మన్ భోజ్యానాయక్, నాయకులు పాల్గొన్నారు.