హనుమకొండ, ఆగస్టు 11 : ధరలు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ప్రైవేట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కాంట్రాక్టర్లు షెడ్లను మూసివేశారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీ నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఈ క్రమంలో ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని నియమించి మంగళవారం కాంట్రాక్టర్లతో చర్చలు జరుపనున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 23 షెడ్స్ ఉండగా, అవి తెరవకపోతే వినియోగదారులకూ తిప్పలు తప్పవని చెబుతున్నారు.
ప్రస్తుతం ముడి సరుకులు, కాపర్, అల్యూమినియం వైర్లతో పాటు కూలీల ధరలు విపరీతంగా పెరిగి నప్పటి కీ రెండేళ్ల కోసం ఇచ్చిన ధరలతో పదేళ్లుగా కొనసాగిస్తూ నష్టపోతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అలా గే కరెంటు బిల్లులు, రవాణా ఖర్చులు గతంతో పోల్చితే పెరిగిపోయాయని, కార్మికుల కొరత, పెరిగిన జీతభత్యాలతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాంట్రాక్టర్ ఏఎన్ రెడ్డి తెలిపారు. సమ్మె నేపథ్యంలో ఫెయిలైన ట్రాన్స్ఫార్మర్లను మార్చడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. కాగా, 16 సర్కిళ్ల పరిధిలో సుమారు 120కి పైగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 వరకు షెడ్స్ ఉంటాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే సమ్మె కొనసాగితే రైతులు, వినియోగదారులకు కరెం టు కష్టాలు తప్పవని పలువురు ఆందోళన చెందుతున్నారు.
రైతులు, వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారు లు ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులో మంగళవారం కాంట్రాక్టర్లతో చర్చలు జరుపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కాంట్రాక్టర్ల డి మాండ్లను ఒప్పుకుంటుందా లేదా..! నేడు తేలనుంది.
ధరలు పెంచాలని ఈ నెల ఒకటవ తేదీన ప్రైవేట్ విద్యుత ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కాంట్రాక్టర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. గతంలో 2023లో కాంట్రాక్టర్లు టెండర్‌ను బైకాట్ చేస్తే వారితో చర్చించి కొంత మేరకు తాత్కాలికంగా ధరలు పెంచాం. చర్చలు జరిపి కాంట్రాక్టర్లు సమ్మె విరమించేందుకు చర్యలు తీసుకుంటాం.
– కే రాజు చౌహాన్, సీజీఎం-2 ఆపరేషన్, ఎన్పీడీసీఎల్