బయ్యారం సెప్టెంబర్ 24: గ్రామాభివృద్ధికి దాతలు ఇచ్చిన సీఎంసీ(చౌదరి మైనింగ్ కంపెనీ) స్థలం ఆక్రమణకు గురైందని అఖిలపక్షం నాయకులు నిరసన చేపట్టడంతో బయ్యా రంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.. బస్డాండ్ సెంటర్లోని సర్వే నంబర్ 68లోని 1800 గజాల స్థల విషయంలో అఖిలపక్షం నాయకులు, ఆ భూమి కొనుగోలు చేసిన భూక్యా శ్రీరాం మధ్య ఏళ్లుగా వివాదం సాగుతోంది. ఈ క్రమంలో శ్రీరాం కోర్టును ఆశ్రయించి ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టాడు.
ఈ క్రమంలో అఖిలపక్ష నాయకుల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నిర్మాణాలను కూల్చివేసేందుకు యత్నిస్తున్నారని ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశముందని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 25 మంది అఖిల పక్షం నాయకులతోపాటు కొనుగోలు చేసిన శ్రీరాం, ఏసు, హరిరాంలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకుడు గౌని ఐలయ్య మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్డాడాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడ్డరంగా ఉందన్నారు. అక్రమ అరెస్టులపై బయ్యారం, గంధంపల్లిలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు నిరసన చేపట్టారు. కాగా, జిల్లా ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ బయ్యారం పోలీస్ స్టేషన్ను సందర్శించి స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు, స్థ్ధానిక పరిస్థితులను పర్యవేక్షించారు.