చెన్నారావుపేట, డిసెంబర్ 30 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేడి నీటి బకెట్లో పడి చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఔసులతండాలో ఈ నెల 6న వేడి నీటి బకెట్లో చిన్నారి(3) పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. హెడ్‌కానిస్టేబుల్ జన్ను స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన సహదేవుల వెంకన్న మూడేండ్ల కూతురు జాహ్నవికి స్నానం చేయిద్దామని బకెట్లో వేడి నీళ్లు పోసి ఇంట్లోకి వెళ్లి సబ్బు తేవడానికి వెళ్లాడు.
ఈ క్రమంలో చిన్నారి బకెట్లో కూర్చోగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన హన్మకొండలోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ దవాఖానకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 29న మృతి చెందింది. గురువారం మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.