నారాయణపేట,సెప్టెంబర్ 16: పేట జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్‌కు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు పాలమూరు, రంగారెడ్డి ఎత్తి పోతల పథకం ప్రారంభం అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.
పులకరించనున్న పాలమూరు
మరికల్, సెప్టెంబర్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సాకారమైన సహకారం పాలమురు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ రాకతో కరువు జిల్లా పాలమూరు పులకరించిపోనుందని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖరెడ్డి అన్నారు. మండ లంలోని అన్ని గ్రామల నుంచి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బస్సుల్లో తరలి వెళ్లారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పథకం కాల్వల ద్వారా నారాయణపేటకు సాగునీరు రానుందని దీంతో ప్రతి గ్రామం పచ్చని పంటలతో కళ కళలాడుతుందన్నారు. నార్లాపూర్ తరలిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, ఆయా గ్రామల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
త్వరలో కృష్ణమ్మ పరవళ్లు
ధన్వాడ, సెప్టెంబర్ 16 : మండలంలోని బీడు భూముల్లో త్వరంలో కృష్ణమ్మ పరుగులు పెడుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణుల పెద్ద ఎత్తున సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వల ద్వారా పేట నియోజకవర్గానికి సాగునీరు రానుందన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, ధన్వాడ సర్పంచ్ ఆమరేందర్ రెడ్డి, నాయకులు సచిన్, సునీల్‌రెడ్డి, సుధీర్‌కుమార్, నారాయణ రెడ్డి, మురళీధర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద నుంచి
దామరగిద్ద, సెప్టెంబర్ 16: మండలంలోని అన్ని గ్రామాల నుంచి దాదాపు 15 బస్సుల్లో నార్లాపూర్‌కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలి వెళ్లారు. వాహనాలను ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కా ర్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ భీమయ్యగౌడ్, ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్‌గౌడ్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, ఎంపీటీసీ కిషన్‌రావు, నాయకులు కేవీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం
కోస్గి రూరల్, సెప్టెంబర్16: మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో సీఎం సభకు తరలి వెళ్లారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాహనాలను కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోస్గి పట్టణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు నియోజకవర్గం నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో..
మక్తల్ టౌన్, సెప్టెంబర్16: ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సారథ్యంలో మక్తల్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సీఎం సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.
నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో…
మక్తల్ అర్బన్, సెప్టెంబర్16: మక్తల్ పట్టణం నాయీబ్రాహ్మణ సంఘం నాయకుడు ఎన్.బీ. నాయుడు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సెలూన్ షాపులకు ఉచిత కరెంటు ఇచ్చి నాయీ బ్రాహ్మణులను ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో నాయుడు, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నర్వ మండలం నుంచి…
నర్వ, సెప్టెంబర్16: మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములు శెట్టి, వైస్ ఎంపీపీ వీణావతి శంకర్, జెడ్పీటీసీ జ్యోతికిరణ్ ప్రకాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్, వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ నుంచి..
కృష్ణ, సెప్టెంబర్ 16 : మండలం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, ఎంపీపీ పూర్ణిమా వెంకట్‌రెడ్డి పాటిల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌పాటిల్, ప్రధాన కార్యదర్శి మోనేశ్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు శివప్ప, మండల యువనాయకుడు శివారాజ్ పాటిల్ మండలంలోని అన్నిగ్రామాల సర్పంచులు, ఎపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.