శాయంపేట, మార్చి 13 : కోడి కొండెక్కి కూర్చుంది. మళ్లీ ధరలు ఆకాశాన్ని చేరాయి. కొద్ది రోజులుగా చికెన్ బహిరంగ మార్కెట్లో కిలో రూ.300 దాటింది. దీంతో సామాన్యులకు చికెన్ దూరమవుతున్నది. కొంత కాలంగా ధర లు అదే స్థాయిలో ఉన్నాయి. కిలో రూ.280 తగ్గలేదని ప్రజలు చెప్తున్నారు. వేసవి కావడంతో మరింత పెరిగి రూ.300 కిలో చేరిందంటున్నారు. కోడి ధర ఏకంగా కిలో రూ.200 చేరింది. స్కిన్లెస్ చికెన్ రూ.320 పలుకుతుండటంతో చికెన్ ప్రియులకు ఇబ్బందికరం గా మారింది.
అయితే చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో మాం సం తినే పరిస్థితి కనుమరుగవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. వేసవి తీవ్రత పెరిగి కోళ్లు చనిపోతుండటంతో ఫాం యాజమానులు ఉత్పత్తిని తగ్గిస్తున్నార ని, దాంతో కొరత ఏర్పడిందని చికెన్ సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. దీం తో శుక్రవారం కోళ్లు లేకపోవడంతో కొ న్ని చోట్ల చికెన్ సెంటర్లు మూసివేసినట్లు పలువురు చెప్పారు. చికెన్ కొరత మరిం త తీవ్రమయ్యేపరిస్థితి ఉందని, ధరలు ఇంకా పెరుగుతాయని అంటున్నారు.