బచ్చన్నపేట, అక్టోబర్ 17 : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే చేర్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న అన్నారు. శుక్రవారం మండలంలోని ఆలింపుర్, కట్కుర్, బండ నాగారం, కేసిరెడ్డిపల్లి గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ యూత్ జిల్లా నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తరలించాలని, తద్వారా గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తుందని అన్నారు. అదేవిధంగా సకాలంలో యూరియా అందించిందని వెల్లడించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని అన్నారు. అంతేకాకుండా రేషన్ కార్డులు సైతం అందించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు సకలవస్తులు కల్పించాలన్నారు. గన్ని బ్యాగులు ఎప్పటికప్పుడు రైతులకు అందించాలన్నారు. మిల్లర్లు సైతం ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్లాలని సూచించారు. దాన్యం విక్రయించిన కొద్ది రోజుల్లోనే డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో మండల ఇంచార్జి బండ కింది హరిబాబు గౌడ్, మండల నాయకులు ఎండి మసూద్, నల్లగోని బాలకిషన్ గౌడ్, జంగిటి విద్యనాథ్, పాకాల కర్ణాకర్, జ్యోతి భాస్కర్, క్రాంతి కుమార్, నజీర్, పెద్దపాటి కరుణాకర్ రెడ్డి, దేవి ఎల్లారెడ్డి, వంగాల శ్రీకాంత్ రెడ్డి, దాసారం శ్రీనివాస్, జ్యోతి భైరయ్య, మట్టి బాలరాజు, పరమేష్, ఇక్బాల్, గోపాల్ రెడ్డి, అరవింద్ రెడ్డి, మల్లారెడ్డి, అలవాల ఎల్లయ్య, మహిపాల్ రెడ్డి, దిద్దిగ రమేష్, గుర్రపు బాలరాజు, సిద్ధులు, ఏపీఎం రవి, సీసీలు సదానందం, నరసింహులు, కేంద్ర నిర్వాహకులు కవిత, భాగ్య, సప్న, సునంద, యాక, హమాలీలు పాల్గొన్నారు.