పర్వతగిరి, సెప్టెంబర్ 11 : తాను బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించి తన పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా మార్పిడి చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కోమితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్యకు సర్వే నెంబరు 185/7/1లో 1.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
గతంలో తీసుకున్న క్రాప్‌లోన్‌కు సంబంధించి రుణమాఫీ కాలేదని, పీ ఎం కిసాన్ యోజన డబ్బులు రాలేదని బ్యాంకు అధికారులను మల్లయ్య ఆరా తీశాడు. దీంతో వారు పరిశీలించి అతడి పేరిట భూమే లేదని తేల్చిచెప్పారు. భూమిని ఎవరికో అమ్ముకున్నావని, బ్యాంకులో తీసుకున్న క్రాప్‌లోన్ డబ్బులు కట్టాలన్నారు. వేరే వారికి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని వ్యవసాయ అధికారులు తెలపడం తో, ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకున్న మ ల్లయ్య రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యా దు చేశాడు.
2023లో అజ్మీరా కోమి పర్వతగిరి తహసీల్దార్‌గా పని చేసిన సమయంలో మల్ల య్య భూమిని అతడి బంధువు ఎర్రం దూడయ్యకు అక్రమంగా పట్టా చేసినట్లు రుజువులున్నాయని ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రస్తు తం వేలేరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న కోమిపై చీటింగ్ కేసుతో పాటు, ఎర్రం దూడయ్య, అతడికి సహకరించిన స్థానిక గ్రామస్తులు వెంకటేశ్వ ర్లు, రాజు, అఫ్సర్ పాషాపై ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.