కరీమాబాద్, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా కరీమాబాద్ బీరన్నకుంటలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.97 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన బస్తీ-మనబడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు మహర్దశ రానుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో మార్పులు తీసు కువస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో పాఠశాలలో వసతులను కల్పిస్తున్నారని తెలిపారు. దీంతో సర్కారు బడుల విద్యార్థులు పోటీ పరీక్షల్లు, క్రీడల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన చేపడున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యను అందిస్తోందన్నారు. ప్రభుత్వ బడుల అభివృద్ధి మనందరి బాధ్యత అన్నారు. నియోజకవర్గ పరిధిలోని బడులను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవి, మాజీ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి, డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్‌కుమార్, నాయకులు వొగిలిశెట్టి అనిల్‌కుమార్, వనం కుమార్, వొగిలిశెట్టి సంజీవ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
పోచమ్మమైదాన్ : గ్రేటర్ 13వ డివిజన్ ఎంహెచ్ నగర్లో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. జానీ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరైన ముస్లింలు, మైనార్టీ మత పెద్దలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి, డివిజన్ అధ్యక్షుడు యాకుబ్‌పాషా, మహ్మద్ అబ్దుల్లా ఖాదరి, మహ్మద్ హజారుద్దీన్ పాల్గొన్నారు.