హనుమకొండ, సెప్టెంబర్ 22: న్యూఢిల్లీలోని ఫ్రెండ్షిప్ ఫోరం సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ ఉద్యోగి రతన్ అవార్డు-2025 సంవత్సరానికిగాను తెలంగాణలో హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళికి అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో చేసిన సేవలకు ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డులో మెమెంటో, బంగారుపతకంతో పాటు సర్టిఫికెట్ ఇచ్చారు. చంద్రమౌళి విద్యావ్యవస్థకు చేసిన విశిష్టమైన సేవలను, కళాశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషితో పాటు అకాడమిక్ రంగంలో విశేష సేవలు చేసిననందుకు అందజేసినట్లు తెలిపారు.
ఈ అవార్డు తెలంగాణ నుంచి వరంగల్‌కు చెందిన చంద్రమౌళికి రావడం జిల్లాకే గర్వకారణమని, అవార్డు వచ్చినందుకు అధ్యాపకులు, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డి.సురేష్‌బాబు,
అకాడమిక్ కో-ఆర్డినేటర్ ఎం.అరుణ, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ విజయకుమార్, ప్రసాదరావు, కుమారస్వామి, సాంబమూర్తి, బోధన బోధనేతర సిబ్బంది చంద్రమౌళికి అభినందనలు తెలిపారు.