హనుమకొండ చౌరస్తా, మే 12: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కొర్ ఉంటేనే పథకం వర్తిస్తుందని చెప్పడం రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సిబిల్ స్కోర్ వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 6000 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్తులు స్వీకారణ పూర్తయిన తర్వాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివ ప్రకటించడం లబ్దిదారుని నోట్లో మట్టికొట్టడం అవుతుందని విమర్శించారు.
కనీసం 10 లక్షల వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం వలన అనేక మంది పేదలకు ఒక్కరికి కూడా రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదన్నారు. సిబిల్ స్కోర్ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని వెంకటేశ్వర్‌రెడ్ది డిమాండ్ చేశారు.