బీఆర్ఎస్ హయాంలోనే పరకాల అభివృద్ధి
బీఆర్ఎస్ హయాంలోనే అన్ని విధాలుగా పరకాల అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో నిర్మించిన భవనాలకు కాంగ్రెస్ సర్కారు రంగులు అద్ది ప్రారంభిస్తూ ప్రచారం చేసుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.
- రంగులు వేసి ప్రారంభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, ఆగస్టు 15 : బీఆర్ఎస్ హయాంలోనే అన్ని విధాలుగా పరకాల అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో నిర్మించిన భవనాలకు కాంగ్రెస్ సర్కారు రంగులు అద్ది ప్రారంభిస్తూ ప్రచారం చేసుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. శనివారం పరకాలలో విలేకరులతో మాట్లాడుతూ పరకాల ప్రజల ఆకాంక్ష మేరకు మంజూరు చేసి పూర్తి చేసిన వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాలకు రంగులు వేసి, తామే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.
రెండున్నరేళ్లలో పరకాల పట్టణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇప్పటికీ హాస్పిటల్కు అవసరమైన యంత్ర పరికరాలు రాలేదని, సిబ్బంది నియామకం కూడా చేపట్టలేదన్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రారంభం పేరిట హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు రంగులు వేసుకోవడం కాదని, కాంగ్రెస్ చేసిన ఒక కొత్త అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపించాలని చల్లా సవాల్ విసిరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

