గణపురం : గణపురం తాసీల్దార్ కార్యాలయంను గురువారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం తాసీల్దార్ సతీశ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు. గణపురం మండలంలోని సింగరేణి, జెన్కోలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. భూ సమస్యలు ఉన్నా రైతులను తాసిల్దార్ కార్యాలయం చుట్టు తిప్పుకోకుండా జవాబుదారిగా నిర్వహిస్తూ రైతుల సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననులు పొందాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ సాయిని సతీశ్ కుమార్, డిటి సత్యనారాయణ, ఆర్ఐ సాంబయ్య, వీఆర్వోలు శ్రావణ్, శ్రీనివాన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.