హనుమకొండ చౌరస్తా : ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు ( Private Schools Fee )దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ( BRSV ) కేయూ మాజీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. అనంతరం సూపరింటెండెంట్ శైలజకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా భైరపాక ప్రశాంత్ మాట్లాడుతూ అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని , అనుమతిలేని వాటిని సీజ్ చేయాలని కోరారు. బుక్స్, డ్రెస్సులు, బ్యాగుల పేరుతో లక్షల్లో తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పడానికి ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రిని నియమించకపోవడమే కాంగ్రెస్ పరిపాలనకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించలేదని, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతుందని విమర్శించారు. విద్యాశాఖ యంత్రాంగమంతా కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ యూనివర్సిటీ ఇన్చార్జి డాక్టర్జెట్టి రాజేందర్, కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్, నాయకులు గొల్లపెల్లి వీరస్వామి, పిన్నింటి విజయ్ కుమార్, చిర్ర ప్రకాష్ గౌడ్, గబ్బెట కరుణ్, వెన్నోజు ఉదయ్, వంశీ, వినీత్, తదితరులు పాల్గొన్నారు.