PV Sindhu | చైనా ఓపెన్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ.. ప్రీక్వార్టర్స్‌లో చెన్ చేతిలో ఓటమి
PV Sindhu | చైనా ఓపెన్ (China Open) బ్యాడ్మింటన్ టోర్నీ (Badminton Tourney) నుంచి భారత స్టార్ షట్లర్ (India's star Shuttler) పీవీ సింధు (PV Sindhu) ప్రీక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నాలుగో ర్యాంకర్, చైనా స్టార్ చెన్ యుఫేయీ (Chen Yufei).. పీవీ సింధుపై 16-21, 22-20, 21-18 తేడాతో విజయం సాధించింది.
PV Sindhu : చైనా ఓపెన్ (China Open) బ్యాడ్మింటన్ టోర్నీ (Badminton Tourney) నుంచి భారత స్టార్ షట్లర్ (India’s star Shuttler) పీవీ సింధు (PV Sindhu) ప్రీక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నాలుగో ర్యాంకర్, చైనా స్టార్ చెన్ యుఫేయీ (Chen Yufei).. పీవీ సింధుపై 16-21, 22-20, 21-18 తేడాతో విజయం సాధించింది. ఒక గంటా 29 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరి వరకు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు.
ఇటీవల జపాన్ ఓపెన్‌లో టైటిల్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న సింధు తొలి గేమ్‌ను అద్భుతంగా కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ విజయం అంచుల వరకు వెళ్లిన ఆమె నాలుగు మ్యాచ్ పాయింట్లను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న యుఫేయీ రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లోనూ ఇద్దరూ నువ్వా-నేనా అన్నట్లుగా పోరాడినా, చివర్లో యుఫేయీ కీలక పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
దాంతో గతవారం జపాన్ ఓపెన్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి యుఫేయీ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఈ ఓటమితో చైనా ఓపెన్‌లో సింధు పోరాటం ముగిసింది. అయితే మ్యాచ్ మొత్తం అత్యున్నత స్థాయి ర్యాలీలు, పోరాట స్ఫూర్తితో సాగి అభిమానులను అలరించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

