పథకాల రద్దు కుట్రపై భగ్గుమన్న బీఆర్ఎస్
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ భగ్గుమంది. వాటిని కొనసాగించాల్సిందేనని నినదించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసింది. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికింది.
- ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ కొనసాగించాల్సిందే
- కాంగ్రెస్ సర్కారు తీరుపై పార్టీ శ్రేణుల మండిపాటు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు
- ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డీటీలకు వినతిపత్రాలు
- వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీఎం దిష్టిబొమ్మ దహనం
- అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత
- దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు నాయకుల అరెస్టు
- ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 17 : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ భగ్గుమంది. వాటిని కొనసాగించాల్సిందేనని నినదించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసింది. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికింది. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డీటీలకు వినతిపత్రాలు అందజేసింది. వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహ నం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు ప లువురిని అరెస్టు చేశారు. ఆందోళనలో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా వ్యతిరేక విధానాల పై మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
పార్టీ శ్రేణులు రోడ్లపై ధర్నా, రాస్తారోకో చేసి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ పథకాలను కొనసాగించాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డీటీలకు వినతి పత్రం అందజేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పరకాల, భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, కమలాపూర్, దామెరలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండలో గులాబీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
పాలకుర్తి, చిల్పూరులో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మహబూబాబాద్‌లోని ఎమ్మార్వో సెంటర్లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇనుగుర్తి, కేసముద్రం, గూడూరు, గార్లలో పార్టీ శ్రేణులు, మరిపెడలో మాజీ మంత్రి ధరంసోత్ రెడ్యానాయక్, బయ్యారంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు పాల్గొని రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డా రు. ములుగు, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం(నూగూరు), మల్లంపల్లిలో గులాబీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో 353 జాతీయ రహదారిపై కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే.. ఎగవేతలు.. కూల్చివేతల ప్రభుత్వమని విమర్శించారు.

బీఆర్ఎస్ ఆఫీసు నుంచి భారీ ర్యాలీ
హనుమకొండలోని బీఆర్ఎస్ ఆఫీసు నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు పార్టీ శ్రేణులు కలిసి ర్యాలీగా వెళ్తున్న క్రమంలో వరంగల్ కలెక్టరేట్ వద్ద సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం దిష్టి బొమ్మను దహనం చేయడంతో వరంగల్ కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాస్యం వినయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల సంక్షేమంతో ఆటలాడటం సరికాదన్నా రు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావి ధిగా కొనసాగించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

