దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులను నాటి పాలకులు విస్మరిస్తే పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారికి భరోసా అందించి ఆసరా పింఛన్లను రూ.4016కు పెంచారని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
- దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు
- ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్, బీజేపీకి గుణపాఠం చెప్పాలి
- బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి
- ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి
- రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 5 : ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులను నాటి పాలకులు విస్మరిస్తే పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారికి భరోసా అందించి ఆసరా పింఛన్లను రూ.4016కు పెంచారని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమావేశానికి వడగం అంజేయులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారని తెలిపారు. సమైక్య పాలనలో దివ్యాంగులకు పెన్షన్‌గా రూ. 500 ఇస్తే, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.వెయ్యి నుంచి రూ.4016కు పెంచారని గుర్తు శ్రీహరి చేశారు. దీనిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
ఉగాది నుంచి దివ్యాంగులకు రూ. 5016 పెన్షన్
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే వచ్చే ఉగాది నుంచి దివ్యాంగుల పింఛన్‌ను రూ. 5016 పెంచేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారని, ఇందుకనుగుణంగా ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించారని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో రూ.1100, రాజస్థాన్‌లో రూ.1500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో రూ. 1000 మాత్రమే ఇస్తున్నారని వివరించారు. ఎన్నికలు రావడంతో ప్రజలకు మాయమాటలు చెప్పేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారానికి వస్తున్నందున వారిని నిలదీయడంతోపాటు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో కోటి రూపాయలతో దివ్యాంగులకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
కడియంను భారీ మెజార్టీతో గెలిపించాలి : వాసుదేవరెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ఎన్నికలు రావడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4016 పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 5,763 మంది దివ్యాంగులున్నారని, మీరంతా కుటుంబ సభ్యులు, బంధువులతో కడియం శ్రీహరికి 20 వేల ఓట్లు పడేలా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షడు మాచర్ల గణేశ్, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, సర్పంచ్ గాదెపాక అనితా సుధాకర్ బాబు, దివ్యాంగుల సంఘం నాయకులు ఎండీ మున్నా, దామెర రమేశ్, దీకొండ నరేశ్, వీ యాదగిరి, గంటా లక్ష్మి, ఎస్ సమ్మయ్య, బీ కుమారస్వామి, డీ మంగ, కే లక్ష్మణ్, ఎం వీరస్వామి, ఆర్ సత్యనారాయణ, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, సభ్యులు ఇల్లందుల విజయ్, సంపత్ రాజు, జీడి ప్రసాద్, యాట అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- Congress
- disability pension
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

