హనుమకొండ, నవంబర్ 9 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హనుమకొండకు రానున్నారు. రాంపూర్ సమీపంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.
అక్కడి నుంచి హనుమకొండకు బయలుదే రుతారు. ఈ క్రమంలో కడిపికొండ బ్రిడ్జి వద్ద వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగ ల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్కు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీ గా పార్టీ కార్యాలయానికి చేరుకొని 3 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు.