MLA Palla Rajeshwar Reddy | బచ్చన్నపేట, జూలై 11 : జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలోని బచ్చన్నపేటలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచందర్, మాజీ ఎంపీపీ నాగజ్యోతి, కృష్ణంరాజు, వైస్ ఎంపీపీ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రమణ రెడ్డి మాట్లాడుతూ జనగామ ప్రజల ఆశాజ్యోతి, ఆరోగ్య ప్రదాత ఎమ్మెల్యే పల్లా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. తుమ్మలపల్లిలో కాంసాని సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపిటీసిల ఫోరం మాజీ అధ్యక్షుడు దూడల కనకయ్య, నాయకులు వడ్డేపల్లి మల్లారెడ్డి, కొండి వెంకటరెడ్డి, ఈదులకంటి ప్రతాపరెడ్డి, మహేందర్ రెడ్డి, కోడూరు శివకుమార్ గౌడ్, ఇమ్మడి జితేందర్ రెడ్డి, తిరుపతి గౌడ్, షబ్బీర్, నర్సిరెడ్డి, ఫిరోజ్, రాజు గౌడ్, కిష్టయ్య, హరి ప్రసాద్, వేణుగోపాల్, అజీమ్, శశిధర్ రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, హరీష్, బాలచందర్, గోవర్ధన్ రెడ్డి, అనిల్ రెడ్డి, రాములు, ఉమా మహేష్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు, సిద్ధారెడ్డి, నూకల నర్సిరెడ్డి, రాజనర్సు, కోనేటి స్వామి, ఆంజనేయులు, వెంకట్ రెడ్డి, పుల్లయ్య, చందు, శ్రీధర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.