ఎల్కతుర్తి, జూలై 20 : కాళేశ్వరంతో పాటు దేవాదుల ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించడంతో పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో చౌరస్తాలో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ పులి రమేశ్ అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నీటిని పంపింగ్ చేయకుండా పంటలను ఎండపెడుతుందని మండిపడ్డారు.
దేవాదుల ద్వారా నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కరెంటు కూడా సరిగా ఉండకపోవడంతో ఉన్న కొద్ది నీరు కూడా పంటలకు పారించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, మాజీ ఎంపీపీ మేకల స్వప్న, నాయకులు మునిగడప శేషగిరి, తంగెడ నగేశ్, కడారి రాజు, పిడిశెట్టి రాజు, కొమ్మిడి మహేందర్‌రెడ్డి, దేవేందర్‌రావు, గుండా ప్రతాప్‌రెడ్డి, గొడిశాల వినయ్, అల్లకొండ రాజు, రవీందర్రావు, రాజేశ్వర్‌రావు, గుండేటి సతీశ్, చెవుల తిరుపతి, ఎండీ మదార్, సాంబమూర్తి, జూపాక జడ్సన్, అంబాల రాజుకుమార్, దుగ్యాని సమ్మయ్య, చెవుల కొమురయ్య, చదిరం నాగేశ్వర్, చిట్టిగౌడ్, మంతుర్తి కొమురయ్య, వేముల శ్రీనివాస్, సాతూరి శంకర్, సంపత్, కృష్ణవేణి, భాగ్య పాల్గొన్నారు.