పాలకుర్తి రూరల్, ఆగస్టు 20 : అర్హులైన రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని తాజా మాజీ ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు.
రైతులకు రుణమాఫీ చేయని రేవంత్‌రెడ్డి సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.31వేల కోట్ల రుణమాఫీ చేస్తానని ప్రకటించిన ప్రభుత్వం 17వేల కోట్లే రుణమాఫీ చేసిందని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. అనంతరం ఏడీఏ పరశురామ్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, బ్యాంక్ వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, ధరావత్ యాకూబ్ నాయక్, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, గుగ్గిళ్ల యాకయ్య, తాడేం రవి, పోశాల వెంకన్న, పుస్కూరి కళింగరావు, ఎండీ నాసర్, నకీర్త యాకయ్య, రంగినేని సత్యనారాయణరావు, నక్క నాగయ్య, గోపి, గర్వందుల మల్లేశ్, లకావత్ వెంకట్, నాగరాజు, కమ్మగాని వెంకటేశ్ పాల్గొన్నారు.