గిర్మాజీపేట/నర్సంపేట/నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/నెక్కొండ, నవంబర్ 25 : రాష్ట్రంలో రైతులు, గిరిజనులు, దళితులు, ఆదీవాసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం మానుకోటలో కేటీఆర్ అధ్యక్షతన తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాన్వాయ్‌లో వెళ్లారు. ఉదయం శివనగర్‌లో ధర్నాకు వెళ్లే కార్యకర్తల కాన్వాయ్‌ను నన్నపునేని జెండా ఊపి ప్రారంభించా రు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేట ర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిల ర్లు, చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పెద్ద ఎత్తున మానుకోటకు తరలివెళ్లారు. అలాగే, నర్సంపేటలోని తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల స్తూపం వద్ద నివాళులఅర్పించిన అనంతరం ధర్నాకు బయలు దేరారు.
దార్ల రమాదేవి, మచ్చి క నర్సయ్యగౌడ్, బైరి తిరుపతిరెడ్డి, పులిగిల్ల యాదగిరి, అప్పాల సుదర్శన్, మం చోజు కల్యాణరాముడు, మునిగాల సాయికృష్ణారెడ్డి, దండుగ రమేశ్, దొంగల సురేశ్, దోనాల రవి, గాండ్లోజు భాస్కర్, వేల్పుల సురేశ్, పెండ్యాల యాదగిరి, మేడిద శ్రీనివాస్, మోడం కోటి, రాజమౌ ళి పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నా మాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణు లు మానుకోటకు తరలివెళ్లారు.
మండల క్లస్టర్ ఇన్చార్జిలు మోతె పద్మనాభరెడ్డి, మోతె జయపాల్‌రెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోటూరి రవి, మచ్చిక నర్సయ్యగౌడ్, కడారి కుమారస్వామి, కొడారి రవ న్న, కట్ల సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు భూక్యా వీరన్న, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య నాయకులు భూక్యా వీరునాయక్, వల్లాల కర్ణాకర్, సంకటి గణపతిరెడ్డి, మాజీ సర్పంచ్ గొడిశాల రాంబాబు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలో పార్టీ మాజీ అధ్యక్షుడు బాల్నె వెంకన్న ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
వారిలో మాజీ జడ్పీటీసీ పత్తినాయక్, సొసైటీ చైర్మన్ మురహరి రవి, మాజీ సర్పంచ్‌లు అనుముల కుమారస్వామి, కాలునాయక్, కడారి సాయిలు, మురళి తదితరులు ఉన్నారు. నెక్కొండ మండలం నుంచి ధర్నాకు తరలి వెళ్లిన వారిలో పార్టీ మం డల అధ్యక్షుడు సంగని సూరయ్య, న్యా యవాది కొమ్ము రమేశ్‌యాదవ్, మాజీ ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ లావుడ్య సరోజ హరికిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, మాజీ ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, మండల నాయకులు ఈదునూరి యాకయ్య, బాదావత్ రవి, వాగ్యానాయక్, మాదార్ ఉన్నారు.