మహబూబాబాద్, జూన్ 16 : మహబూబాబాద్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు నూతనంగా ప్రారంభించిన విజయశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విస్తృత సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని స్థానిక రిలయన్స్ మార్ట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయశ్రీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… విజయశ్రీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, సేవలు అందుబాటులో ఉన్నాయని, దవాఖాన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంతో నైపుణ్యం గల వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయశ్రీ, డాక్టర్ రాము, కాంగ్రెస్ నాయకులు ఖలీల్, ఎడ్ల రమేశ్, కత్తి స్వామి పాల్గొన్నారు.