వరంగల్ : జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ రూట్లలో కాజువేల మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామం వద్ద బైక్ పై వెళ్తున్న తల్లీకొడుకులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోతుండగా వారిని స్థానిక యువకులు కాపాడారు.