సుబేదారి, డిసెంబర్2: హనుమకొండలోని హంటర్‌రోడ్డులో ఉన్న కాకతీయ జూపార్క్‌కు పెద్ద పులి జంట వ చ్చిందోచ్. ఇక కరీనా-శంకర్ జంటను కనులా రా చూసి ఆనందించవచ్చు. టైగర్ కపుల్స్ రావడం తో జంతుప్రదర్శనశాలకు న్యూ లుక్ వచ్చింది. ఇంతకాలంగా వరంగల్ జూపార్క్‌కు పెద్ద పులిని తీసుకురావాలని అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సఫలీకృతమయ్యాయి. ఆరేళ్ల క్రితమే తెలంగాణ అటవీశాఖ తరఫున హం టర్రోడ్డు జూపార్కులో స్రవంతి, దేవా చిరుత పులులను తీసుకొచ్చారు. దీంతో జూపార్క్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. కొత్తగా రెం డు పెద్ద పులులను జిల్లా అటవీశాఖ అధికారులు హైదరాబాద్ నెహ్రూ జూపార్కు నుంచి ప్రత్యేక బోను ఉన్న వాహనంలో తీసుకొచ్చారు.
హంటర్‌రోడ్డు కాకతీయ జూపార్క్‌కు వచ్చిన కరీనా-శంకర్ కపుల్స్ రెండు, మూడు రోజుల్లో సందర్శకుల ముందుకు రానున్నాయి. ఇందుకోసం రెండింటికి వేర్వేరుగా బోనులు తయారుచేశారు. మంగళవారం లేదా బుధవారం అధికారికంగా టైగర్స్‌ను సందర్శకుల ముందుకు తీసుకురావడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకంగా డే షెల్టర్, రాత్రివేళ వాటికి రక్షణగా నైట్ షెల్టర్‌ను తయారు చేస్తున్నారు. వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ జూపార్క్నుంచి ఇద్దరు ట్రైనర్స్‌ను తీసుకొచ్చారు. టైగర్స్ జంట రాకతో జూపార్కుకు సందర్శకుల తాకిడి మరింత పెరుగనున్నది. ఇప్పటికే సెలవు దినాల్లో కిక్కిరిసిపోతుండగా, ఇకనుంచి టైగర్స్ జంటను చూడడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సందర్శకులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.