జనగామ, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గంలో ఘర్ వాపస్ షురూ అయింది.. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రఘునాథపల్లి మండలంలో బిగ్‌షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఫిరాయించిన, కడి యం వెంట వెళ్లిన బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ‘ఘర్ వాపస్’లో భాగంగా ఒక్కొక్కరు సొంత గూటికి వస్తున్నారు. కొద్దినెలల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ జడ్పీటీసీ మారపాక రవి కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరగా, తాజాగా సో మవారం ఎమ్మెల్యే కడియం ముఖ్య అనుచరుడి గా ఉన్న రఘునాథల్లి మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్‌కుమార్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి జనగా మ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని నందీనగర్ నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో రఘునాథపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన బొల్లం ఉమారాణి, అజయ్‌కి స్వయాన వదిన. ఆమె కూడా త్వరలోనే కేటీఆర్ సమక్షంలో గులా బీ కండువా కప్పుకోనున్నదని తెలిసింది. కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, వెల్ది గ్రామ ఉపసర్పంచ్ ఎడ్ల బా లరాజు, బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ రావుల తిరుమల్‌రెడ్డి, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దండిగ మహేశ్‌యాదవ్ పాల్గొన్నారు.