Bhadrakali temple | వైభవంగా భద్రకాళీ బ్రహ్మోత్సవాలు.. శరభ, పుష్పరథ వాహనాలపై అమ్మవారి ఊరేగింపు
భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు పదకొండో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం భద్రకాళీ అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. చతుస్థానార్చన అనంతరం అమ్మవారిని శరభ వాహనం, సాయంత్రం పుష్పరథంపై ఊరేగించారు. వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాశ్‌రావు దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు. పూలు, పండ్లను సమర్పించారు.
Bhadrakali temple | వరంగల్, మే 2 : భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు పదకొండో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం భద్రకాళీ అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. చతుస్థానార్చన అనంతరం అమ్మవారిని శరభ వాహనం, సాయంత్రం పుష్పరథంపై ఊరేగించారు. వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాశ్‌రావు దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు. పూలు, పండ్లను సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన ఆర్యవైశ్య నాయకులకు ఈవో శేషుభారతి, అర్చకులు స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసిన అనంతరం వారికి మహామండపంలో ఆశీర్వచనం ఇచ్చి, అమ్మవారి శేష వస్ర్తాలను బహూకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తొనుపునూరి వీరన్న, మల్యాల వీరమల్లయ్య, అల్లాడి వీరభద్రయ్య, పోకల చందర్, కోడూరి శివప్రసాద్, అయితా గోపీనాథ్, చకిలం రాజేశ్వర్‌రావు, దివ్వెల పూర్ణచందర్, ఎల్లంకి రవీందర్, రవ్వ గీత, లావణ్య, శ్రీలత, రమాదేవి, ప్రావీణ, అన్నపూర్ణ, శైలజ పాల్గొన్నారు.
కురుమ సంఘం ఆధ్వర్యంలో పుష్పరథ సేవ
భద్రకాళీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అమ్మవారి పుష్పరథ సేవలను కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కురుమ కుల సంఘం అధ్యక్షుడు, కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో జరిగిన పుష్పరథ సేవలో నాయకులు దండు దయాసాగర్, ఏర కోటేశ్వర్, కోరె కృష్ణ, మండల పరశురాములు, సవాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

