హనుమకొండ, నవంబర్ 6: కేయూ దూరవిద్య కేంద్రం ప్రాంగణంలో బీసీ విద్యార్థుల ధర్మదీక్షకు అనుమతి ఇవ్వాలని కేయూ బీసీ విద్యార్థులు కోరారు. ఈ మేరకు గురవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు సుమన్రాజ్, అజయ్‌సింగ్, గణేష్ మాట్లాడుతూ 9న ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో బీసీ విద్యార్థుల ధర్మదీక్ష బీసీ విద్యార్థి జేఏసీ నుంచి నిర్వహించారు.
బీసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మేమెంతో మాకు అంత వాటా ప్రకారం రిజర్వేషన్లు వచ్చేంతవరకు కూడా కేయూ విద్యార్థులు, ఉద్యోగులు అన్ని విద్యార్థి సంఘాల నాయకులు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు రాజశేఖర్, అన్వేష్, రాజేష్, అనిల్, శ్రీహరి, వినోద్, సాయి పాల్గొన్నారు.