బీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతూ 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోశాల పద్మ మాట్లాడుతూ మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
- వాడవాడలా గులాబీ నేతల పర్యటన
- గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన
- సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన
- తూర్పులో నన్నపునేని చేసిన అభివృద్ధిపై కరపత్రాల పంపిణీ
కరీమాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతూ 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోశాల పద్మ మాట్లాడుతూ మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పోశాల స్వామి, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి పాల్గొన్నారు. 42వ డివిజన్లో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్-పద్మ ఆధ్వర్యంలో నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పెందోట సోమేశ్, మండల సురేశ్, పాల రంజిత్, అంబటి రమ, పూల శివ పాల్గొన్నారు.
తెలంగాణలో ఆదర్శ పాలన
వరంగల్‌చౌరస్తా: తెలంగాణ సాధించుకున్న అతి తక్కువ సమయంలోనే ఆదర్శవంతమైన పాలన అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని బీఆర్ఎస్ 27, 36 డివిజన్ల అధ్యక్షులు పోలెపాక యాకయ్య, వేల్పుగొండ యాకయ్య కోరారు. 27వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలతోపాటు 36వ డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షులు వేల్పుగొండ యాకయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు లావణ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షులు గడల రమేశ్, రాజారపు అనిల్, పత్తి జంపయ్యతో కలిసి డివిజన్ పరిధిలోని చింతల్, చంద్రవదన కాలనీ, జయశంకర్ కాలనీ, జ్యోతిబసు నగర్, శాంతినగర్, పుప్పాలగుట్ట ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ అద్భుత ప్రగతికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
నరేందర్ గెలుపు కోసం ప్రచారం
ఖిలావరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అండర్ రైల్వేగేటు ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో డివిజన్ అధ్యక్షుడు పగడాల సతీశ్, బీఆర్ఎస్వీ నగర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేసి నన్నపునేనిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. అలాగే, 35వ డివిజన్లో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, 37వ డివిజన్లో కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, శ్రమశక్తి అవార్డు గ్రహీత బిల్లా శ్రీకాంత్, ఉద్యమకారుడు అచ్చ విద్యాసాగర్, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో తూర్పుకోటలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. 38వ డివిజన్లో కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ ఆధ్వర్యంలో పడమర కోటలో నన్నపునేని నరేందర్ తరఫున ప్రచారం చేశారు.
నన్నపునేనిని ఎమ్మెల్యేగా గెలిపించాలి
కాశీబుగ్గ: నిరుపేదల పెన్నిధి సీఎం కేసీఆర్ సారథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ ప్రచారం నిర్వహించారు. 19వ డివిజన్లోని కాశీబుగ్గలో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు, దళితులు, మైనార్టీలు, బీసీలకు ప్రత్యేక పథకాలు అందించినట్లు చెప్పారు. నన్నపునేనిని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు గోరంటల మనోహర్, నాయకుడు వేముల నాగరాజు పాల్గొన్నారు. అలాగే, 20వ డివిజన్లో జాగృతి వరంగల్ తూర్పు కన్వీనర్ పెండ్యాల సోను ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, డివిజన్ అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్, కిన్నెర రంజిత్, చిమ్మని గోపి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు మార్వాడీల మద్దతు
పోచమ్మమైదాన్: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు పలు మార్వాడీ కుటుంబాలు మద్దతు తెలిపాయి. 22వ డివిజన్లోని 16వ బూత్‌లో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మార్వాడీల ఇళ్లకు వెళ్లిన వారికి సాదర స్వాగతం పలికారు. తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే నరేందర్‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పి కార్పొరేటర్ కుమారస్వామి, నాయకులకు స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శివ, బూత్ ఇన్చార్జి తోట రాము, రాధాకృష్ణ పాల్గొన్నారు. 24వ డివిజన్లో కార్పొరేటర్ ఆకుతోట తేజస్వీ శిరీష్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్, అనిల్‌కుమార్, ముష్కె ప్రమీల, దుబాసి సమ్మక్కతోపాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే నరేందర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. 12వ డివిజన్లో కార్పొరేటర్ కావటి కవిత, డివిజన్ ఇన్చార్జి యెలుగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేశాయిపేటలో విస్తృత ప్రచారం చేశారు. 13వ డివిజన్లో కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి ఆధ్వర్యంలో పలు ప్రాంతాలు తిరుగుతూ ప్రచారం చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

