హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 6: ఏపీలోని కాకినాడలోని జేఎన్టీయూలో ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి సాయికుమార్ ఎంపికైనట్లు ఆర్ట్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
కాలేజీలో విద్యతో పాటు క్రీడలను కూడా విశేషంగా ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ కాలేజీ గౌరవాన్ని మరింత పెంచుతున్నారన్నారు. విద్యార్థులు ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమేకాకుండా భవిష్యత్‌లో ఉన్నతస్థాయి అవకాశాలకు దారి తీస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్‌కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఏ.టి.బి.టి. ప్రసాద్ ఉన్నారు.