అభాగ్యులకు ‘ఆసరా’ అయిండు.. దివ్యాంగులకు ఊతమైండు.. పేదింటి యువతులకు మేనమామైండు. ఒంటరి ఆడబిడ్డలకు అన్నలా అండగా ఉన్నడు. మసక జీవితాలకు ‘వెలుగులు’ పంచిండు. మనిషిని పోగొట్టుకున్నోళ్లకు ఇంటి పెద్దదిక్కయిండు. అనేక సంక్షేమ పథకాలతో ఎంతో మంది బతుకులకు భరోసా కల్పిస్తున్నడు. అడుగకుండానే వరాలిచ్చే దేవుడైండు.. నేడు జననేత.. ప్రగతి ప్రదాత.. ప్రజా పాలకుడు.. రైతు పక్షపాతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు.. ఊరూరా ఆయన జన్మదినాన్ని పండుగలా జరుపుకొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు సిద్ధమయ్యారు.
– వరంగల్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి సంగతి అటుంచి బతుకుదెరువు కరువై ఆగమైన పల్లెలకు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోశారు. ఆ కులం, ఈ కులం అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారికి సరికొత్త పథకాల ద్వారా బతుకు భరోసానిచ్చారు. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ గ్రామాల్లో కష్టాలను కళ్లారా చూసి.. వాటిని కడతేర్చేందుకు ప్రాణాలు పణంగా పెట్టి.. అలుపెరుగని పోరు చేసి స్వరాష్ర్టాన్ని సాధించారు.
ప్రజల ఆదరణ, అండతో పరిపాలనా పగ్గాలు చేపట్టి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తిస్తూ అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తూ ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అమలు చేస్తున్నారు. కొన్నింటిని ప్రజలు అడుగకున్నా తనకు తానుగా గుర్తించి సరికొత్త పథకాలు రూపొందించి ఆచరణలో పెడుతున్నారు. ఎంతోమంది అభాగ్యులకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తూ జనం గుండెల్లో నిలిచిపోయారు. పేదింటి తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కావద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధులు తమ పిల్లలపై ఆధారపడకుండా ఆసరా పింఛన్లు, చూపు సమస్యలు తొలగించేందుకు కంటివెలుగు, అన్నదాతలు, వారి కుటుంబాల కోసం రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలతో అనేక మందికి వెన్నుదన్నుగా నిలిచారు. వాటి ద్వారా లబ్ధిపొందిన వారు సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారు.
నాడు స్వయంగా చూసి..చలించి..
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో అప్పట్లో తండాలు, శివారు పల్లెలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకోక ప్రజలు పడుతున్న బాధలను కేసీఆర్ కళ్లారా చూశారు. పల్లెనిద్రలో భాగంగా వారి దగ్గరికి వెళ్లి సమస్యలను ఓపిగ్గా విన్నారు. 2008లో తండాల్లో గిరిజనుల స్థితిగతులు తెలుసుకునేందుకు కేసీఆర్ తండా నిద్ర కార్యక్రమం చేపట్టారు. నెల్లికుదురు మండలం జామతండాలో రాత్రి నిద్ర చేసి పొద్దున్నే లేచి తండాలో ఇల్లిల్లు తిరుగుతూ.. అందరినీ కలిసి పరిస్థితులను తెలుసు కున్నారు.
ఈ తండా నిద్రలో తెలుసుకున్న సమస్యల నుంచే తండాలను పంచాయతీలుగా మార్చేందుకు బీజం పడింది. జామతండాలోనూ రాత్రి బస చేసి ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి వారి క్షేమ సమాచా రాలు తెలుసుకున్నారు. 2009లో గురిజాల నుంచి ‘పల్లెనిద్ర’ను ప్రారంభించారు. అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం నిద్రలేచి బీసీ, యాదవ, ఎస్సీకాలనీల్లో కలియదిరిగారు. ఆ తర్వాత కూడలిలో రచ్చబండ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్ చేసి పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్నం భీమ్లాతండాకు వెళ్లి గిరిజనులతో గంటసేపు గడిపి అక్కడి మహిళలు ప్రత్యేకంగా తయారుచేసిన పజ్జొన్న రొట్టెలను పచ్చకూర, అవకాయ పచ్చడితో తిన్నారు.
ప్రజలంతా సంఘటితమైతేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని కేసీఆర్ ఉద్ఘాటించారు. 2002లో వెంకటాపూర్ మండలం బూర్గుపేట, ములుగు మండలంలోని భాగ్యతండాలో అగ్ని ప్రమాదం కారణంగా ఇండ్లు కాలిపోగా విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆయా గ్రామాలకు వచ్చారు. పార్టీ తరఫున బాధితులకు అండగా నిలిచారు. భాగ్యతండాకు చేరుకున్న సమయంలో కీమానాయక్ తన బిడ్డ పెండ్లికి దాచుకున్న డబ్బు, బంగారం కాలిబూడిద అయ్యాయని తెలుసుకుని ఆయన భుజం తట్టి ఆ పేద తండ్రి బాధ్యతను స్వీకరించి సొంత ఖర్చులతో అతడి బిడ్డ కల్పన పెండ్లి చేయించారు. పెట్టుపోతలను సైతం అందించారు. ఈ సంఘటన ఆధారంగానే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారు.
సబ్బండవర్గాలకు అండగా..
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక్చూచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ఈ ఎనిమిదేళ్లలో బంగారు తెలంగాణ వైపు బాటలు పడ్డాయి. ఉద్యమ ఆకాంక్షలైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నెరవేరి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అనుభవంలోకి వచ్చాయి. మన నీళ్లు మన పొలానికి పారుతున్నాయి. మన నిధులు సంక్షేమ పథకాల రూపంలో మన ఇంటికే అందుతున్నాయి. మన ఉద్యోగాలు మన వాళ్లకే దక్కుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా కొత్త రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం.. ఇలా అన్నింటిలోనూ దేశానికే దిక్చూచిగా నిలిచింది.
పేద, ధనిక తేడా లేకుండా అందరినీ అక్కున చేర్చుకున్న కేసీఆర్ సబ్బండవర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారు. ‘వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా అందరికీ ఆసరా అవుతున్నాడు. ఎవరిపైనా ఆధార పడకుండా బతికేలా భరోసా ఇస్తున్నాడు.. పేదలు, అభాగ్యులను తోడ బుట్టిన అన్న లెక్క ఆదుకుంటున్నాడు. అందరి కష్టం తెలిసినోడు.. అంద రి బాగోగులు చూసుకునే నాయకుడి పుట్టిన రోజు వేడుకలను నేడు ఊరూ రా పండుగలా జరుపుకొనేందుకు ప్రజలు, అభిమానులు, బీఆర్ ఎస్ నా యకులు ఏర్పాట్లు చేసుకున్నారు.
కేసీఆర్ గొప్ప మానవతావాది
రామా శ్రీనివాస్, మోక్షారామం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తెలంగాణ ఉద్యమసారథిగా, మంచి పరిపాలకుడిగా కంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గొప్ప మానవతావాది. కేసీఆర్ ఎప్పుడూ ప్రజల బాగు కోసం, తెలంగాణ కోసం ఆతృతపడుతుంటారు. 35 ఏండ్లుగా నేను కేసీఆర్‌ను చూస్తున్నా. పేదల కష్టాలు తీర్చాలని ఆయన నిరంతరం ఆలోచిస్తారు. ఆయనది సున్నిత మనస్తత్వం. చిన్న విషయానికే చలించిపోతారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎప్పటికీ ఆలోచిస్తూ ఉండేవారు. పార్టీ పెట్టకముందు నుంచే తెలంగాణ కోసం సోమాజిగూడలో వార్‌రూం నడిపారు. తెలంగాణ రిటైర్డ్ అధికారులతో నిరంతరం సమావేశాలు నిర్వహించేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించేవారు. పేదల కడుపునింపడం ఎలా? ఏం చేస్తే తెలంగాణ బాగుడుతుంది అని ఎప్పుడూ తపించేవారు. ఈ అంశాలపైనే విస్తృతంగా చర్చలు జరిపేవారు. చంద్రబాబునాయుడు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదని కొందరు చేసే వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుంది.
కేసీఆర్ ఒక్కరికే కాదు.. కేసీఆర్ సూచించిన మరో నలుగురికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబునాయుడు ఆఫర్ చేశారు. కానీ, కేసీఆర్ ఆ ఆఫర్‌ను పక్కనపెట్టారు. డిప్యూటీ స్పీకర్ తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరు ఎలాంటి అంశాన్ని తన వద్దకు తీసుకొచ్చినా, మాట్లాడినా చివరకు చర్చ మొత్తం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంవైపు ఫోకస్ అయ్యేలా కొనసాగించేవారు. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. ఉద్యమంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల విషయంలో, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎలాంటి మార్పు రాకపోవడం నిజంగా కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వ్యక్తి కేసీఆర్. ఆయన అందరినీ ఆప్యాయంగా పిలుస్తారు. సాధారణ రాజకీయ నేతలా కాదు ఆయన తీరు. ఏదైనా మనసుతోనే ఉంటుంది. ఎన్ని రోజులకు కలిసినా ఏ పదవిలో ఉన్నా అదే దగ్గరితనం ఉంటుంది.
జన్మదిన కానుకగా ములుగు జిల్లా
ములుగు, ఫిబ్రవరి16 (నమస్తేతెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ములుగు ఏజెన్సీ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకొని తన జన్మదిన కానుకగా రాష్ట్రంలో 33వ జిల్లాగా ఏర్పాటు చేశారు. 2018 ప్రజా ఆశీర్వాద సభ సాక్షిగా ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించి ఇచ్చిన మాట తప్పకుండా 2019 ఫిబ్రవరి 17న తొమ్మిది మండలాలతో కూడిన ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే కలెక్టర్, ఎస్పీలను నియమించి అప్పటికప్పుడు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. తన జన్మదిన కానుకగా ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి, ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఐదేళ్లలో ప్రగతి పథం
రాష్ట్రంలో చివరి జిల్లాగా ఏర్పడిన ములుగు జిల్లా సీఎం కేసీఆర్‌తో ప్రత్యేక దృష్టితో ప్రగతి పథాన దూసుకుపోతున్నది. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. ఐదేళ్లలో ములుగును అన్ని విధాలా అభివృద్ధి చేశారు. సమీకృత కలెక్టరేట్‌తో పాటు 300 పడకల ప్రభుత్వ దవాఖాన భవనాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురా బోతున్నారు. మెడికల్ కళాశాలను సైతం మంజూరు చేశారు.
సీఎం కేసీఆర్ వల్లే జిల్లా
ఆంధ్రా పాలకుల కాలంలో ములుగు ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇటు వ్యవసాయానికి, అటు తాగునీటికి తండ్లాడేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాలను పునర్వవస్థీకరించారు. ములుగు ప్రాంత ప్రజల ఆకాంక్షను తెలుసుకొని తన పుట్టిన రోజు నాడే జిల్లాగా మార్చారు. తమ ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ను ములుగు ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.
– ముంజాల భిక్షపతిగౌడ్, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు
కేసీఆర్ అంటే..!