హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాదికారి డి.వాసంతి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 నుంచి 29 వరకు స్వీకరించనున్నట్లు, దరఖాస్తు చేసేవారు 17 నాటికి 18 సంవత్సరాలు నిండి 45 ఏళ్లలోపు ఉండాలన్నారు.
పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని, సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సులో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. దరఖాస్తులను హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఇత వివరాలకు సంబంధిత www.bse.telangana.gov.in వెబ్సైట్లో చూడాలని సూచించారు. మే 1 నుంచి జూన్ 6 వరకు (42 రోజులు) శిక్షణ తరగతులు నిర్వహిస్తారని వాసంతి తెలిపారు.