సుబేదారి, అక్టోబర్ 18 : కొత్త మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. రెండేళ్ల కాల వ్యవధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. శనివారం చివరి రోజు కావడంతో ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములు గు, జయశంకర్ భూపాలపల్లిలో ఎక్సైజ్ శాఖ అధికారులు అర్థరాత్రి వరకు దరఖాస్తు లు స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలో 294 షాపులకు శుక్రవారం వరకు 4,544 దరఖాస్తులు రాగా, శనివారం ఒక్కరోజే 6,245 దరఖాస్తులు రావడం తో మొత్తంగా 10,789కి చే రింది. ప్రభుత్వ ఖ జానాకు టెండర్ల రూపంలో రూ. 323.67 కోట్ల ఆ దాయం చేరింది.
వ్యాపారుల సిండికేట్..
చివరి రోజున మద్యం టెండర్లకు పాత, ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్నవారు, కొత్తవారు సిండికేట్గా మారి ఎక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలు చేశారు. పోటీ తక్కువ ఉన్న షాపుల వివరాలు తెలుసుకొని చివరి సమయంలో దరఖాస్తులు అందజేశారు. అయితే టెండర్ ఫీజు రూ. 3 లక్షలు కావడంతో గతంకంటే ఈ సారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. రెండేళ్ల క్రితం రూ. 2 లక్షల ఫీజుండగా ఉమ్మడి జిల్లాలో 15,944 దరఖాస్తులు దాఖలయ్యాయి. కాగా, ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిన లైసెన్స్దారులను ఎంపిక చేయనున్నారు.
జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు
వరంగల్ అర్బన్ (హనుమకొండ) : 3,621
వరంగల్ రూరల్ (వరంగల్) : 1,905
భూపాలపల్లి, ములుగు : 1,615
జనగామ : 1,798
మహబూబాబాద్ : 1,850
మొత్తం : 10,789